అయితే టిటిడి లెక్కల ప్రకారం ప్రతి రోజు 5 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిత సేవా టిక్కెట్లు, హుండీ ఆదాయం, తలనీలాలు ఇలా వివిధ రూపాల్లో ఆదాయం వస్తుంటుంది. కానీ ఈ మొత్తం ఆదాయం నిలిచిపోయింది. మార్చి 20వ తేదీన ఆలయంలోకి భక్తుల అనుమతిని నిలిపివేశారు.
ఇక తిరుమలలో వ్యాపారాల గురించి తెలిసిందే. భక్తుల కోసం టోపీలు, చిన్న చిన్న దండలు, హోటళ్ళు ఇలా ఎన్నో తిరుమలలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ పూర్తిగా మూతపడిపోయాయి. దీంతో చివరకు తిరుమలలో షాపుల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మళ్ళీ ఆలయంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు.. భక్తులతో తిరుమల ఎప్పుడు కళకళలాడుతుందా అని ఎంతో ఆత్రుతగా స్థానిక షాపు యజమానులు ఎదురుచూస్తున్నారు.