ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. అలాగే, ఇదే జిల్లాలోని తడలో ఒకే కుటుంబంలోని నలుగురికి ఈ వైరస్ సోకినట్టు తాజాగా తేలింది. మరోవైపు, జిల్లా వ్యాప్తంగా మొత్తం నమోదైన పాజిటివ్ కేసులు 56గా ఉన్నాయి
కాగా, ఇటీవల కరోనా సోకిన జిల్లా కేంద్రానికి చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడిని చికిత్స నిమిత్తం చెన్నై ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఆయన అంత్యక్రియలు కూడా చెన్నైలోనే నిర్వహించగా, వాటికి కూడా ఆయన కుటుంబ సభ్యులు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది.