చంద్రబాబు రైతుకు మార్గం చూపట్లేదు: సీపీఐ సెటైర్లు

గురువారం, 2 అక్టోబరు 2014 (14:21 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సెటైర్లు విసిరారు. చంద్రబాబు నాయుడుకు భగవంతుడు మార్గం చూపాడు కానీ బాబు మాత్రం రైతుకు మార్గం చూపడం లేదన్నారు. దీనిపై అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
 
రుణమాఫీపై తనకు భగవంతుడే మార్గం చూపాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ స్పందించారు. రుణాల మాఫీపై చంద్రబాబు చెప్పిన దానికి చేస్తున్నదానికి ఎక్కడైనా పొంతన ఉందా అని ప్రశ్నించారు. 
 
రుణమాఫీపై చంద్రబాబు రోజుకో మాట చెప్పి మాయ చేస్తున్నారని రామకృష్ణ తెలిపారు. రైతు రుణమాఫీపై పాదయాత్ర చేసేటప్పుడు ఓ మాట, ఎన్నికలప్పుడు ఓ మాట, తొలి సంతకం రోజున ఓ మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు.

వెబ్దునియా పై చదవండి