ప్రియురాలు పట్టించుకోలేదని.. కిరోసిన్ పోసి తగులబెట్టిన ప్రియుడు..

బుధవారం, 24 అక్టోబరు 2018 (14:57 IST)
ప్రియురాలు పట్టించుకోలేదని ప్రియుడు ఆమెను కిరోసిన్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వీరి పేర్లు సానియా, సల్మాన్. వివరాల్లోనికి వస్తే.. వీరిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇక ఈ విషయం గురించి ఇద్దరు వాళ్ల ఇంటి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
 
ప్రియుడు ఇంట్లో వారి ప్రేమ విషయాన్ని అందరు అంగీకరించారు. కానీ, ప్రియురాలి ఇంట్లో తిరస్కరించారు. దాంతో ప్రేమికులిద్దరు అసహానానికి లోనయ్యారు. ఏం చేయాలో తెలియక బాధపడుతున్నారు. ఐతే ప్రియురాలి కుటుంబ సభ్యులు ఆమెకు మరో అబ్బాయితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే ఆ అమ్మాయి మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. నేను ప్రేమించిన అతనినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. 
 
అయినా కూడా కుటుంబ సభ్యులు సానియా మాటను వినకుండా.. బలవంతంగా మరో అబ్బాయితో పెళ్లి చేశారు. కొన్ని రోజులు అలానే గడిచింది. సానియా కూడా రాజీపడి తన భర్తతో సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నది. సల్మాన్ కోపంగా ప్రియురాలి ఇంటికి వచ్చి.. ఆమెను కిరోసిన్ పోసి తగులబెట్టాడు. దాంతో ఇంటి చుట్టుపక్కన గలవాళ్లు పోలీసులకు ఈ ఘోరాన్ని తెలియజేశారు. ఆ ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. సల్మాన్ తనే ఈ నేరాన్ని చేశానని ఒప్పుకుని పోలిసులకు లొంగిపోయాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు