అక్కడ తగ్గితే ఇక్కడ వర్షాలు పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల కదలికలు తెలంగాణలో బలహీనంగా ఉన్నట్టు చెప్పారు. బంగాళాఖాతంలో ఎలాంటి మార్పులు లేవని, వాతావరణం సాధారణంగా ఉందని పేర్కొన్నారు.
కాగా, నల్గొండ జిల్లా నిడమానూరులో ఈ నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలుగా ఉంది. మరో నాలుగైదు రోజులపాటు ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.