సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. జాతీయ మీడియా వ్యవహారాలు , అంతర్రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను కూడా అమర్ కు అప్పగించారు.
వీరు ఈనాడు, ఉదయం, ఆంధ్ర భూమి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలలో పనిచేశారు . ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి కూడా అమర్ పనిచేశారు.