జగన్ సాక్షి పత్రికను చదవొద్దు: ప్రజలకు చంద్రబాబు సూచన

శుక్రవారం, 27 నవంబరు 2015 (10:37 IST)
అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి పత్రిక అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ పత్రికను చదివితే అయోమయమే తప్ప వాస్తవులు తెలియవు. అందుచేత వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన సాక్షి పత్రికను చదవొద్దని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు. సాక్షి పత్రిక సిగ్గులేని రాతలు రాస్తోందని, ఆ పత్రిక యజమాని వారానికోసారి కోర్టుకు కూడా వెళ్తున్నాడంటూ.. చంద్రబాబు ఎద్దేవా చేశారు.
 
గురువారం విజయవాడలో ఇసుక విధానంపై శ్వేతపత్రం విడుదల కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. సాక్షి పత్రికను చదివి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని.. దానికి బదులుగా చదవకుండా ఉండటం ఎంతో మేలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాలతో సంబంధం లేని పత్రికలను చదవాలని ఆయన ప్రజలకు సూచించారు. 

వెబ్దునియా పై చదవండి