ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 24 న బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రముఖులను కలవడానికి ఢిల్లీ రావడం జరిగిందన్నారు. జాతీయ ఏసీ కమిషన్ ఛైర్మన్ విజయ్ సంప్లా, వైస్ చైర్పర్సన్ అరుణ్ హైదర్ లను కలిశామన్నారు.
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎస్సీ/ఎస్టీ లకు రక్షణ కల్పించగలగాలన్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం నేరాలను అడ్డుకోవడానికి, నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడాలని పేర్కొన్నారు. ఎస్సీ లకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి చేస్తోందన్నారు.