ఖర్చు చేయడం కంటే పొదుపు చేయడమే ముఖ్యం : ఎస్పీడిసీఎల్ సిఎండి

శనివారం, 20 డిశెంబరు 2014 (20:23 IST)
విద్యుత్తు అధికంగా వినియోగించి వచ్చే విద్యుత్తు చార్జీల ద్వారా ఖర్చు చేయడం కంటే ఆదా చేసి డబ్బులు మిగుల్చుకోవడం చాలా మంచిదని ఆంధ్ర్రప్రదేశ్ దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగు డైరెక్టర్ హెవై దొర తెలిపారు. వినియోగదారులు విద్యుత్తు పొదు సూత్రాలను పాటించాలని కోరారు. తిరుపతిలో ఆయన విద్యుత్తు పొదుపుపై పోస్టర్లు విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్తు ఉత్పత్తి చేయడం కంటే విద్యుత్తును ఆదా చేయండ చాలా ముఖ్యమనే అంశాన్ని వినియోగదారులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. విద్యుత్తు ఆదా అనేది సామాజిక బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి