ఖాళీగా తిరుమల కొండ

గురువారం, 22 ఏప్రియల్ 2021 (11:02 IST)
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తిరిగి కోరలు చాస్తున్న క్రమంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ రోజురోజుకు తగ్గుతోంది. ఇటీవల కొవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను టీటీడీ తగ్గించిన విషయం తెలిసిందే.

వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తిరుపతిలోని విష్ణువివాసంలో, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఇచ్చే సర్వదర్శన టోకెన్ల జారీని రద్దు చేయడంతో శ్రీవారిని దర్శించుకునే సంఖ్య 50 వేల నుంచి 25వేలకు పడిపోయింది.

దీంతో తిరుమల క్షేత్రంలో భక్తుల సందడి తగ్గింది. శ్రీవారి ఆలయంలో తప్ప మిగిలిన ప్రదేశాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీలు, వివిధ కార్యాలయాలు కూడా భక్తులు లేక వెలితిగా కనిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు