దొంగబాబాల గుట్టు రట్టు అవుతుంది. ఇప్పటికే డేరా బాబా వంటి స్వామీజీల గుట్టు రట్టు అయ్యింది. తాజాగా టీవీలలో జాతకాలు చెబుతూ, సమస్యలు తీర్చే స్వామిగా కనిపించి, బయట హోమాలు చేస్తానంటూ లైంగికంగా లొంగదీసుకునే నకిలీ స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు.
జ్యోతిష్యంలో మెలకువలు నేర్చుకుని, మీర్ పేటలోని గాయత్రీనగర్‌లో ‘భవిష్య వాణి’ పేరిట కార్యాలయం ప్రారంభించాడు. ఇతడే టీవీ ఛానళ్లల్లో జ్యోతిష్య కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఈ ప్రచారంతో విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరుల్లో కొత్త కార్యాలయాలు తెరిచాడు. హోమం పేరిట అకృత్యాలు చేశాడు.
నమ్మి వచ్చిన వారిని లక్షల మేరకు వసూలు చేశాడు. పనిలోపనిగా బలహీన మనస్కులైన మహిళలను లోబరచుకునేవాడు. హోమాల పేరుతో కామదాహాన్ని తీర్చుకునే బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద భారీ విలువ చేసే ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.