తిరుమలలో నకిలీ ప్రవేశ టిక్కెట్ల దందా.. ఎస్.పి.ఎఫ్.కానిస్టేబుల్‌పై కేసు

మంగళవారం, 4 జనవరి 2022 (14:19 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన నకిలీ టిక్కెట్ల దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. భద్రతా విభాగంలో విధులు నిర్వహించే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ ఈ నకిలీ టిక్కెట్ దందాను సాగిస్తున్నట్టు బహిర్గతమైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు శ్రీవారి భక్తులకు ఈ టిక్కెట్లను రూ.21 వేలకు విక్రయించి క్యాష్ చేసుకున్నట్టు తేలింది. 
 
వాస్తవానికి ఈ టికెట్ ధర రూ.300 మాత్రమే. కానీ, ఈ టిక్కెట్‌ను ఆ కానిస్టేబుల్ రూ.21 వేలకు విక్రయించారు. ఈ టిక్కెట్లను స్కానింగ్, టిక్కెట్ కౌంటర్ వద్ద పనిచేసే మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి కానిస్టేబుల్ ఈ దందాను కొనసాగిస్తున్నట్టు తేలింది. దీంతో కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు