ఇంటర్ కూడా పాస్ కాలేదు... కానీ డాక్టర్.. భార్య గుట్టు రట్టు చేసిన భర్త!

సోమవారం, 25 జులై 2016 (10:21 IST)
ఆమె ఇంటర్ కూడా పాస్ కాలేదు. కానీ డాక్టర్. ఈ విషయం తెలుసుకున్న భర్త ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ గట్టును రట్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... ఆమె పేరు అర్చన. ఇంటర్ కూడా పాస్ కాలేదు. అయినా డాక్టర్‌‌గా మారి ప్రాక్టీస్ చేస్తోంది అయితే ఇలా మోసం చేయడం సబబు కాదని తెలుసుకున్న భర్త మెడికల్ కౌన్సిల్‌‌గా ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాల కారణంగానే ఈ బాగోతం బయటపడినట్టు తెలుస్తోంది. 
 
అసలు విషయం తెలుసుకునేందుకు భర్త ఎంత ప్రయత్నించినా భార్య నోరు మెదపలేదు. దీంతో అసలు ఇంటర్ పాస్ కానీ భార్య డిగ్రీ ఎలా పొందింది.. డాక్టర్ ఎలా అయ్యింది అని ఆరా తీశాడు. అర్చన తండ్రి విశ్రాంత ప్రభుత్వాధికారి.. డాక్టర్ కావాలన్నది కుమార్తె కోరికమేరకు పత్రాలన్నీ నకిలీవి తయారు చేయించి వాటిపై ఫోర్జరీ సంతకాలతో చలామణి అయ్యేలా తండ్రి షురూ చేశాడు. 

వెబ్దునియా పై చదవండి