ఈ దారుణ ఘటనపై 13, 14 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలికల వాంగ్మూలాన్ని బాలల సంక్షేమ కమిటీ సభ్యులు తల్లి సమక్షంలోనే నమోదు చేశారు. బాలల సంక్షేమ కమిటీ ఈ ఘటనపై కాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడైన బాలసుబ్రమణ్యంపై బాలల లైంగిక వేధింపుల నివారణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.