వ్యతిరేకతకు భయపడే జగన్ ఎన్నికలకు వెనకడుగు: పిల్లి మాణిక్యరావు

శనివారం, 9 జనవరి 2021 (20:13 IST)
దేశప్రధాని అయినా, రాష్ట్రాల ముఖ్యమంత్రులయినా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని, కానీ జగన్మోహన్ రెడ్డికి అదే నచ్చడం లేదని, రాజ్యాంగానికి లోబడి పనిచేయడమంటే ఆయనకు గిట్టదని, ప్రజాస్వామ్యమంటే ఆయనకు కడుపులో మంటని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావుఎద్దేవాచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ...!
 
నేరప్రవృతి నుంచి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన ఇష్టమొచ్చినట్లుగా పాలనచేస్తానంటున్నాడు.  ఎవరైనా, ఏ వ్యవస్థైనా తానుచెప్పినట్లే నడుచుకోవాలనే దురభిప్రాయంలో ఆయన ఉన్నాడు.  రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్నికల కమిషనర్ ఉండగా తాను ఎన్నికలు నిర్వహించబోనని గతంలోనే ఆయన తన మంత్రులతో చెప్పించాడు. మేం ఎన్నికలు నిర్వహించకపోతే ఈ కమిషనర్ ఏమి పీకుతాడనే విపరీతవ్యాఖ్యానాలు కూడా జగన్ తన మంత్రులతో చేయించాడు.

కొడాలినానీ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎన్నికల కమిషనర్ నిదూషిస్తూ ఎంతదారుణంగా మాట్లాడారో ప్రజలందరూ గమనించారు. వారిద్దరి మాటలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నందున  వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని మేం భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషనర్ కు కులం అంటగట్టి మాట్లాడాడు. ప్రజలు,  ప్రాంతాలు, కుల,మతాల మధ్య చిచ్చుపెట్టేలా అనేకసందర్బాల్లో వ్యవహరిం చాడు.  తన పబ్బం గడుపుకోవడానికి రాష్ట్రాన్ని కూడా విచ్ఛిన్నం చేయాలని చూశాడు. ఎస్ఈసీ వ్యవహారంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు ముమ్మాటికీ రాజ్యాంగవిరుద్ధమే  

కోర్టులను సంప్రదించి, ప్రభుత్వంతో సంప్రదించాక ఎన్నికలకు వెళ్లా లని ఎస్ఈసీ భావిస్తుంటే, వ్యవస్థలకు వ్యతిరేకంగా, చట్టానికి విరు ద్ధంగా మంత్రులు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఎస్ఈసీని తొలగించిన ప్రభుత్వం ఆనాడురాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించి, తమిళనాడు నుంచి కనగరాజ్ అనేవ్యక్తిని అంబులెన్స్ లో తీసుకొచ్చి మరీ హడావుడి చేసి, ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.  మాజీ జడ్జి అయిన కనగరాజ్ ని స్మగ్లర్ల మాదిరి దొంగచాటుగా అంబులెన్స్ లో తీసుకు రావాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? కేవలం 12గంట ల్లోనే కనగరాజ్ ను తీసుకొచ్చి ఎస్ఈసీస్థానంలో కూర్చొబెట్టడం రాజ్యాంగవిరుధ్ధమో కాదో ప్రభుత్వం సమాధానంచెప్పాలి.  

ఆనాడుప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగవ్యతిరేకం కాబట్టే, కోర్టులు పాలకుల నిర్ణయాన్ని తీవ్రంగాతప్పుపట్టి, తిరిగి ఎస్ఈసీగా రమేశ్ కుమార్ నే కొనసాగించాయి.  151 సీట్లున్నాయి కదా అని రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళతామంటే ఎక్కడా కుదరదని పాలకులు గ్రహించాలి. 

అబద్ధాల ఆంబోతు రాంబాబుతో, ఇతర మంత్రులతో ఏదిపడితే  అది మాట్లాడిస్తూ, కోర్టులు చెప్పాకకూడా, ఈ ఎన్నికల కమిషనర్ ఉంటే ఎన్నికలు నిర్వహించమని చెప్పడంలోని ఉద్దేశమేమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలి. ప్రభుత్వం ఎప్పుడూ కూడా రాజ్యాంగా నికి లోబడి, అన్ని వ్యవస్థలను గౌరవిస్తూ పనిచేయాలి. అలా కాదని ముందుకెళితే ఎవరికి నష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

కరోనా తీవ్రంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో కోవిడ్ నిబంధ నలు పాటించకుండా, కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా తిరిగినవారు, నేడు కరోనా పేరుతో ఎన్నికలు వద్దని చెప్పడం సిగ్గు చేటు. గతంలో ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదా వేశాడన్న అక్కసుతో  ఆయనపై లేనిపోని ప్రేలాపనలు చేశారు. ఆనాడు ఎన్నికలు వాయిదావేయడమైనా, ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇస్తూ తీసుకున్న నిర్ణయమైనా రెండు స్వాగతించాల్సి నవే.  ఎస్ఈసీ నిర్ణయాన్ని స్వాగతించకుండా, చంద్రబాబుకు లాభం కాబట్టి, రమేశ్ కుమార్ ఎన్నికలు పెడుతున్నాడంటారా? 

ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబునాయుడికి, టీడీపీకి ఎలా లాభమో ప్రభుత్వం చెప్పాలి. ఓట్లేసేది ప్రజలుఅయినప్పుడు, ప్రభుత్వం ప్రతిపక్షానికి లాభమని ఎలా చెబుతుంది. పాలకులు వ్యాఖ్యలు చూస్తుంటే, ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలను అమలుచేస్తోంద ని ఒప్పుకుంటున్నట్లుగా ఉంది.  దళితులపై దాడులతో వారంతా చంద్రబాబునాయుడికి ఓట్లేస్తారని, ముస్లింలు, బీసీలను వేధింపులకు గురిచేశారు కాబట్టి, వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేస్తారని భావిస్తున్నారు.

హిందూమతంపై దాడులు చేస్తున్నారుకాబట్టి, ఆమతం ఓట్లు తమకు పడవనే ఆందోళనలో ప్రభుత్వ పెద్దలున్నారని అర్థమైంది. అందుకే ఎన్నికలు చంద్రబాబు కి లాభమని మాట్లాడుతున్నారు.  ప్రజావ్యతిరేక పాలన సాగిస్తు న్నారు కాబట్టే, పాలకలు ఎన్నికలు చంద్రబాబుకి లాభమని చెబు తున్నారని వారిమాటలతోనే అర్థమవుతోంది.  
కోవిడ్ వైరస్ ను ఆదాయవనరుగా మార్చుకున్న ప్రభుత్వం, టెస్ట్ లు,  కిట్లు, ఇతరపరికరాల పేరుతో ప్రజలను దోచుకుంది.

ఆదాయం కోసం మద్యందుకాణాలు తెరిచి, ఉపాధ్యాయులను అక్కడ కాపలా పెట్టారు. ప్రచారపిచ్చితో పాఠశాలలు తెరిచారు. ఇటువంటి పనులన్నీ చేసినప్పుడు పాలకులకు కోవిడ్ మహమ్మా రి గుర్తుకురాలేదా?  
తమప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ప్రజలంతా తమపాలనపై తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారని అంబటి రాంబాబు ఒప్పుకుంటే మంచిది.

సభలు,సమావేశాలకు ప్రజలు రావొచ్చు, రాకపోవచ్చుగానీ, ఓట్లేయడానికి ప్రజలు తప్పకుండా వస్తారు కాబట్టి, కరోనా వ్యాప్తిచెందే అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయని చెబుతున్న అంబటి, తనప్రభుత్వం, పార్టీ నిర్వహించిన అనేక సమావేశాల్లో వైసీపీకార్యకర్తలు, నేతలు ఎలా విచ్చలవిడిగా తిరిగారో మర్చిపోతే ఎలా? ప్రజలను కూడా బలవం తంగా సభలకు తరలించినప్పుడు కోవిడ్ నిబంధనలు అంబటికి గుర్తులేదా?

అధికారపార్టీ సమావేశాల్లా ఎన్నికలు జరపరని అంబటికి తెలియదా? ప్రజలు భౌతికదూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఓట్లేయడానికి వస్తారని ఆంబోతు రాంబాబుకి తెలియదా? ఎన్నికలనిర్వహణ చేతగాక, అంబటి ఏదో చెప్పి, ఇంకేదో చోట దరువు వేస్తున్నట్లుగా ఉంది. 

టీడీపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని ప్రభుత్వానికి స్పష్టంచేస్తున్నా ను. ప్రభుత్వం పెంచిన వివిధరకాల ధరలు, పన్నులభారం, ఇసుక, మద్యం మాఫియాలతో విసిగివేసారిపోయిన జనం, జగన్ ని కాదని టీడీపిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నందునే టీడీపీ స్థానిక ఎన్నికలకు సిద్ధంగాఉందని చెబుతున్నాం. ఎన్నికల నిర్వహణ ఎస్ఈసీకి సంబంధించిన అంశం.

దానితో పనిలేకుండా, ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజలు మమ్మల్నిఆదరిస్తారన్న నమ్మకంతోనే మేమున్నాము. తిరుపతి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోకూడా తెలియనప్పుడు, ఆసమయానికి కోవిడ్ వైరస్ అనేది రాష్ట్రంలో ఉండదని అంబటిలాంటివాళ్లు ఎలా చెబుతారు?

నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఎన్నికలునిర్వహించే ఎన్నికల కమిషనర్ ఉంటే, అరాచకాలు, దౌర్జన్యాలు,దాడులు చేయడం వీలుకాదని భావిస్తున్నారు కాబట్టే, పాలకులు ఎన్నికల కు భయపడుతున్నారని వారి మాటల్లోనే తెలుస్తోంది. నిజంగా ప్రజలు తమపక్షానే ఉన్నారని వైసీపీ భావిస్తే, తక్షణమే ఎన్నికలకు అధికారపార్టీ సిధ్ధంకావాలని సూచిస్తున్నాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు