ఒమిక్రాన్ వ్యాప్తి: ఇంటింటికి ఫీవర్ సర్వే

సోమవారం, 20 డిశెంబరు 2021 (13:28 IST)
ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ అప్రమత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటింటికి ఫీవర్ సర్వేను తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఇంటింటికి ఫీవర్ సర్వేను నిర్వహించనున్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 150కు చేరువలో ఉంది. 
 
ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పగడ్బంధీగా చేస్తోంది. మరోవైపు ఇవాళ్టి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైంది. 
 
ఇవాళ్టి నుంచి రాష్ట్రమంతా వారానికి ఐదురోజులపాటు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేయనుంది. రాష్ట్రంలోని ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోనున్నారు. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జ్వర పరీక్షలు చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు