కర్నూలులో దారుణం.. పురుగుల మందు పోసి బాలికపై అత్యాచారం..

శనివారం, 24 అక్టోబరు 2020 (16:34 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ళ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను చంపేందుకు బలవంతంగా నోట్లో పురుగుల మందు పోశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 
 
దేవనకొండ మండలం ప్యాలకుర్తి గ్రామంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. స్కూల్ సెలవులు కావడంతో బాలిక ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో పొలం పనుల కోసం తల్లిదండ్రులు పోయారు. ఒంటరిగా ఉన్న ఆమె ఇంట్లోకి చొరబడిన ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. పక్కింటి బాలుడు ఈ దారుణాన్ని చూసి కేకలు వేయడంతో పరారయ్యారు. అంతకు ముందే ఆమెను బలవంతంగా పురుగుల మందు తాగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు