శేషాచల అడవుల్లో మళ్ళీ మంటలు.. పరుగులు పెట్టిన గ్రామాలు

మంగళవారం, 3 మార్చి 2015 (12:19 IST)
తిరుమల కేంద్రంగా ఉన్న శేషాచల అడవుల్లో మళ్ళీ మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా మూడు గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో గడిపారు. తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలంలోని శేషాచలపురం, వెంకటాపురంతో పాటు మరో గ్రామ సమీపంలో అడవుల్లో మంటలు చెలరేగాయి. వందలాది ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతయ్యింది. ఫారెస్టు అధికారులు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఇవన్నీ తిరుమల కొండలను ఆనుకునే ఉంటాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
రేణిగుంట ప్రాంతంలో ఆ మూడు గ్రామాలపై భాగంలో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. వందలాది ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. శేషాచల కొండల్లో చాలా అరుదైన జంతుజాలం ఉంది. ఇలాంటి కొండల్లో అరుదైన జంతుజాలంతో పాటు ఎర్రచందనం విస్తారంగా ఉంది. దీని కోసం ఒకవైపు ఎర్రచందనం స్మగ్లర్లు దారుల కోసం అగ్గి పెడుతూనే ఉన్నారు. ఇది తిరుమల అడవులు పాలిట శాపంగా మారతున్నాయి. తరచూ అగ్గి పెడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఆ గ్రామాలలో మంటలను అదుపు చేయడానికి అటవీశాఖ రంగంలోకి దిగింది. 
 
అర్ధరాత్రి సమయానికి అదుపులోకి తీసుకువచ్చారు. తిరిగి తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ మంటలను ఆర్పడానికి మళ్ళీ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పాడింది. చివరకు అదుపులోకి తీసుకువచ్చారు. 

వెబ్దునియా పై చదవండి