కొడాలి నాని నియోజకవర్గంలో 1058 జి ప్లస్ త్రీ గృహ నిర్మాణాలు

గురువారం, 6 ఆగస్టు 2020 (07:05 IST)
గుడివాడలోని మల్లయపాలెం వద్ద రివర్స్ టెండరింగ్ ద్వారా పునః నిర్మిస్తున్న  జి ప్లస్ త్రీ గృహ నిర్మాణ సముదాయనికి మంత్రులు పేర్ని నాని,  కొడాలి నాని శంకుస్థాపన చేసారు.

ఈ  సందర్భంగా మంత్రి పేర్నినాని మాట్లాడుతూ ..గతంలో గృహ నిర్మాణంలో జరిగిన అవినీతికి దీటుగా రీ టెండర్లు పిలిచి నూతన కాంట్రాక్టులకు ఇచ్చి ప్రతి ఇంటి నిర్మాణానికి లక్ష రూపాయలకు పైగా లబ్ది దారునికి  ఆదాయం చేకూరే విధంగా ముఖ్యమంత్రి వై.యెస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు.

పేదవాడు తన జీవిత కాలంలో సొంత ఇంటిలో వుండాలనే కలను నేడు ముఖ్యమంత్రి వై.యెస్.జగన్మోహన్ రెడ్డి నెరవేర్చుతున్నారన్నారు. పెదవానికి ఇచ్చే ఇళ్లల్లో కూడా గత ప్రభుత్వం ఆదాయవనరులు చేసుకుందన్నారు. నేడు రివర్స్ టెండరింగ్ ద్వారా చదరపు అడుగుకు 300 నుండి 400 రూపాయల వరకు ఖర్చు తగ్గుతుందన్నారు.

గుడివాడ పట్టణంలో లబ్ధిదారుల కొరకు 1058 జి ప్లస్ త్రీ గృహ నిర్మాణ సముదాయనికి పునః నిర్మాణం చేపట్టి త్వరలో లబ్ధిదారులకు అందించడం చాలా సంతోషం గా ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 2008 లో గుడివాడ ప్రాంత పేద ప్రజలకు గృహాలను అందించాలనే లక్ష్యంతో గుడివాడ నుండి హైద్రాబాదు వరకు పాదయాత్రతో వెళ్లి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యెస్.రాజశేఖరరెడ్డిని కలుసుకొని 10 వేల మంది పేదవారికి ఇల్ల స్థలాలు ఇవ్వమని కోరడం జరిగిందన్నారు.

అడిగిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యెస్.రాజశేఖరరెడ్డి మరో ఆలోచన చేయకుండా అక్కడ ప్రజకు కావలసిన స్థలం కొనుగోలు చేయాలని కలెక్టర్ కు అదేశించి 77 ఎకరాలు అందించారన్నారు. గుడివాడలో 42 వేల మందికి సెంటు చొప్పున పట్టా ఇచ్చారన్నారు. ఆ తరువాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 
పట్టించుకోలేదన్నారు.

గత ప్రభుత్వం  లబ్దిదారులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వక పొగ ఒక్కక్కరి నుండి లక్ష రూపాయలు వసూలు చేసిందన్నారు. వై.ఎస్.   జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత రీ టెండరింగ్ విధానం ద్వారా గుడివాడ పట్టణంలో 1058 జిప్లస్ త్రీ ఇళ్ల  పునః నిర్మాణానికి సుమారు 16  కోట్లు ఆదావచ్చిందన్నారు.

లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మరో 180 ఎకరాలు  భూసేకరణ చేసామనన్నారు. పేదవారికి ఇల్లు ఇచ్చే విషయంలో కూడా ప్రతిపక్ష నేతలు కోర్టులో వేశారని కోర్ట్ తీర్పు రాగానే ఆగస్టు 15 వ తేదీన పేదలకు ఇళ్ళ స్థల పట్టాలను అందజేస్తామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు