ఖైరతాబాద్ బొజ్జగణపయ్యకు గవర్నర్ నరసింహన్ తొలిపూజ!

శుక్రవారం, 29 ఆగస్టు 2014 (10:51 IST)
హైదరాబాదులోని ఖైరతాబాదులో ప్రతి యేటా ప్రతిష్ఠించే భారీ బొజ్జ గణపయ్యకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తొలిపూజ చేశారు. ఈ గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెల్సిందే. ఖైరతాబాద్ మహాగణపతిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకుని తొలిపూజ జేశారు. 
 
ఇదిలావుండగా, వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. హైదరాబాదులో గణేశ్ ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. ఖైరతాబాద్ లంబోదరుడికి 5 వేల కిలోల లడ్డూ ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ సాగర తీరంలోనూ వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విశాఖలో 71 అడుగుల భారీ గణపతిని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. 
 
వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి