ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వైద్యం నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పేలుడు సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో నష్టం అంచనా వేస్తున్నారు.