ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తిక కేంద్రం సంచాలకులు గోపరాజు విజయం(84)నేటి తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. నాస్తికోద్య నిర్మాత గోరా 5వ సంతానం అయిన విజయం రాజనీతి శాస్త్రంలో పట్టభద్రులు, ఉద్యమ నేపధ్య కుటుంబంలో పుట్టిన ఆయన దేశవిదేశాల్లో నాస్తికత్వం వ్యాప్తికి విశేష కృషి చేసారు.
అఖిల భారత హేతువాద సంఘాల సమాఖ్య కార్యదర్శిగా ఉన్నారు. గత 25 ఏళ్లుగా సభలు చర్చలు నిర్వహించారు. సమాజంలో పిల్లల కు చిన్నప్పటి నుండే శాస్ట్రీయ దృక్పథం ఉండాలి మూఢనమ్మకాలు నిర్ములన జరిగి ప్రశ్నించే తత్వం ఉండాలని ముందుకు సాగారు.అల్జీమర్స్ వ్యాది వృధాప్యంలో గత 5 నెలలుగా ఇంటి వద్దనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నేటి ఉదయం తుది శ్వాస విడిచారు.
ఆయన భౌతిక దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం మంగళగిరి ఎం ఆర్ ఐ వైద్య కళాశాల కు అందచేశారు.. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్. ఎమ్మెల్యే గద్దె రాం మోహన్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, నగర ప్రముఖులు చుక్కపల్లి అరుణ్ కుమార్, మోతుకూరి వెంకటేశ్వరరావు, రావి శారద, మోతుకూరి అరుణకుమార్, ఒర ప్రసాద్ తదితరులు నివాళులు అర్పించారు.