పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లి గ్రామంలో ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో వైసిపి కి చెందిన రెండు కుటుంబాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
పార్థసారధి రెడ్డి (48), ప్రసాద్ రెడ్డి (62) ఇరువురు బంధువులు. వీరి కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈరోజు ఉదయం ప్రసాద్ రెడ్డి ఇంటి పైకి మచ్చు కత్తి తీసుకొని పార్థసారధి రెడ్డి దాడి చేయబోయాడు.
నన్ను చంపుతాడెమో అన్న ఆందోళనతో ప్రసాద్ రెడ్డి (కాబోయే మండలాధ్యక్షుడు) తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతో పార్థసారధి రెడ్డిపై రెడ్డిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు
అనంతరం అదే తుపాకితో ప్రసాద్ రెడ్డి కూడా తన లైసెన్సు రివాల్వర్ తో ఆయనే కాల్చుకొని మృతి చెందాడు. 2 కుటుంబాలను ముగ్గులు వైయస్ కుటుంబీకులు పులివెందుల ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రస్తుతం పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.