తల్లీకూతుళ్ళతో సహజీవనం.. ఆపై మనుమరాలిపై కూడా... ఎవరా కామాంధుడు?

మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (09:20 IST)
ఓ మహిళ ఆర్థిక స్థితిని ఆసరాగా తీసుకుని ఆమెతో పాటు ఆమె కుమార్తెలతో సహజీవనం చేస్తూ, ఆపై ఆమె మనుమరాలిపై కూడా కన్నేసిన ఓ కామాంధుడి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన గుంటూరులో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని పిడుగురాళ్లకు చెందిన నాగేశ్వరరావు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె ఆర్థిక స్థితిని ఆసరాగా చేసుకుని ఆమెను లోబరుచుకుని సహజీవనం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తెను కూడా లొంగదీసుకుని ఆమెతో కూడా శారీరక సంబంధం పెట్టుకుని సహజీవనం చేయసాగాడు. 
 
అయినప్పటికీ ఆ కామాంధుడి వక్ర బుద్ధి మారలేదు. ఒకవైపు తల్లీకుమార్తెలతో సహజీవనం సాగిస్తూనే చివరికి కూతురి కుమార్తెపై(మనవరాలు)నా కన్నేశాడు. ఆమెకు వివాహమైనప్పటికీ మూడేళ్ల క్రితం భర్తతో విభేదాలు రావడంతో తన కుమార్తెను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. అయితే అక్కడ తల్లితోనూ, అమ్మమ్మతోనూ సహజీవనం చేస్తున్న నాగేశ్వరరావు.. తన కోరిక తీర్చాలంటూ ఆమెపై లైంగిక వేధింపులు ప్రారంభించాడు.
 
అతడికి బుద్ధి చెప్పాల్సిన తల్లి, అమ్మమ్మలు సైతం చివరికి అతడికే వత్తాసు పలికారు. ఈ క్రమంలో బాధితురాలు కొద్ది రోజుల క్రితం పిడుగురాళ్ల నుంచి పారిపోయి గుంటూరులో ఉన్న తన స్నేహితురాలి చెంతకు చేరింది. ఆమె సలహా మేరకు సోమవారం బాధితురాలు రూరల్‌ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పిడుగురాళ్ల సీఐను ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు