ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయి మరో ప్రాంతంలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. రెండు నెలల వైవాహిక జీవింతలో అప్పుడే పిల్లలు వద్దంటూ ఓసారి అబార్షన్ కూడా చేయించాడు. ఇంతలో ఉన్నట్టుండి యుగేంద్ర తన భార్య పూర్ణను పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు. అప్పటికిగానీ ఆ బాలికకు తాను మోసపోయినట్టు తెలుసుకోలేక పోయింది. ఆ తర్వాత తన భర్త ఆచూకీ తెలుసుకోగా అతను గుంటూరు వాసిగా గుర్తించింది. చివరకు గుంటూరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తంమీద ఈ ప్రేమ కథ వైజాగ్ నుంచి గుంటూరుకు చేరుకుంది.