కాకినాడలో బీభత్సం సృష్టించిన ఈదురు గాలులు

సోమవారం, 29 మే 2023 (12:15 IST)
కాకినాడలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలు సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం భయపెట్టింది. అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి. రైల్వే విద్యుత్ లైన్లపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. గాలులు విద్యుత్ తీగలు తెగి చెట్ల కొమ్మలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 
 
సామర్లకోటలో రైల్వే ట్రాక్‌పై విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు రైళ్లు రెండు గంటలపాటు ఆలస్యంగా నడిచాయి. కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో 35 స్తంభాల నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే, కాకినాడ జిల్లాలో భారీ చెట్లు కూలి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు