తిరుపతిలో దర్సన టోకెన్ల కోసం రచ్చ..రచ్చ, టిటిడి ఏం చేసిందంటే..?

శనివారం, 31 అక్టోబరు 2020 (19:03 IST)
తిరుపతిలో శ్రీవారి సర్వదర్సన టోకెన్ల కోసం రచ్చ రచ్చ జరిగింది. వారాంతం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకున్నారు. సర్వదర్సనం టోకెన్లు ఇస్తున్నారని అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ వద్దకు భారీగా వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో టిటిడి చేతులెత్తేసింది.
 
ప్రతిరోజు 3 వేల టోకెన్లు మాత్రమే టిటిడి ఇస్తోంది. కౌంటర్ ప్రారంభించినప్పటి నుంచి కూడా అదేవిధంగా టోకెన్లను అందిస్తున్నారు. పరిమిత సంఖ్యలోనే టోకెన్లను ఇస్తున్నారు. కానీ అర్థరాత్రి నుంచి జనం ఎక్కువగా పడిగాపులు కాస్తుండటంతో చేసేది లేక టిటిడి 5వేల టోకెన్లను ఇచ్చింది.
 
అయినా భక్తులు క్యూలైన్లలో అలాగే ఉన్నారు. ఇక టిటిడి చేతులెత్తేసింది. దీంతో మధ్యాహ్నం భక్తులు ఆందోళనకు దిగారు. స్వయంగా టిటిడి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి రంగంలోకి దిగారు. కౌంటర్ వద్దకు చేరుకుని భక్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
 
అయినా భక్తులు వెనక్కి తగ్గలేదు. దీంతో టోకెన్ల ప్రక్రియను కొనసాగించారు. ఆదివారం, సోమవారానికి కూడా టోకెన్లను ఇచ్చేశారు. ప్రస్తుతం టోకెన్లు పొందిన భక్తులు అయితే సంతోషపడుతున్నారు. కానీ అర్థరాత్రి 12 గంటల పాటు చలిలో భక్తులు నకరయాతన అనుభవించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో భక్తులు వాటిని లెక్కచేయకుండా తోపులాటలు జరుగడంతో టోకెన్ల ప్రక్రియ భూదేవి కాంప్లెక్స్‌లో కొనసాగించాలా లేదా అన్న ఆలోచనలో పడింది టిటిడి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు