అనంతపురం రూరల్ పరిధిలోని కొడిమి గ్రామసమీపంలో వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. బందోబస్తుగా అనంతపురం రూరల్ సిఐ డి.మురళీధర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సమావేశంలో సభ నిర్వాహకులు అతిథులును ఒక్కొక్కరుగా పిలుస్తున్నారు.
ఇద్దరూ వేదికపై కూర్చొని సభా కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీ పదవి దక్కినప్పటికీ స్నేహం విలువ తెలిసిన గొప్ప వ్యక్తిగా మాధవ్‌ను కొందరు ప్రశంసలతో ముంచెత్తారు. అదేసమయంలో విధి నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించే మురళీ లాంటి అధికారి మన జిల్లాకు లభించడం అదృష్టమని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.