ఆదివారం పూట హైదరాబాదులోని ఓ మూడంతస్తుల భవనంలో ఓ 18 నెలల బిడ్డను కిందకు విసిరేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొదటి అంతస్తు నుంచి ఆ బిడ్డను కిందకి విసిరేయడంతో ఆ బిడ్డ తలకు బలంగా గాయమైనట్లు తెలుస్తోంది. బిడ్డ కింద పడిన వెంటనే ఓ వ్యక్తి ఆ బిడ్డను అలానే లేవనెత్తుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కనిపిస్తున్నాయి.
మొదటి అంతస్తు నుంచి ఆ బిడ్డ ప్రమాదవశాత్తూ కిందపడిందని పోలీసులు చెప్తున్నారు. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటి అంతస్తు నుంచి ఆడుకుంటున్న బిడ్డ జారిపడిందని.. ఆ సమయంలో ఆ ఇంట్లో వున్నవారంతా నిద్రపోతున్నారని.. అప్పుడే నిద్రలేచిన బిడ్డ ఆడుకుంటూ.. బాల్కనీ నుంచి జారిపడిందని పోలీసులు చెప్తున్నారు.