బీజేపీ ఎమ్మెల్యేకి పోలీసుల నోటీసులు.. అభ్యంతరకర ఉపన్యాసం..

సోమవారం, 29 సెప్టెంబరు 2014 (12:18 IST)
హైదరాబాద్ గోషామహల్ బీజేజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి పోలీసు శాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అభ్యంతరకర ఉపన్యాసం చేశారనే అభియోగంతో గోషామహల్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసు జారీ అయ్యింది. 
 
గతంలో ఎమ్.ఐ.ఎమ్.ఎమ్మెల్యే అక్భరుద్దీన్ నిర్మల్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసం చేశారన్న అభియోగంపై జైలుకు వెళ్లవలసి వచ్చింది. రాజాసింగ్‌కు ముందుగా నోటీసు జారీ అయింది. 
 
కొద్ద రోజుల క్రితం గోషామహల్ నియోజకవర్గ అభివృద్ది కార్యాలయం వద్ద రాజాసింగ్ ఒక ప్రసంగం చేస్తూ దాండియా ఉత్సవంలో హిందువులు కాని వారిని అనుమతించరాదని ఉత్సవ సంఘాలకు ఆయన సూచించారన్నది అందులో ఉన్న సారాంశం. 
 
ఈ సమాచారం పత్రికలలో కూడా వచ్చింది. అయితే ఇది అభ్యంతరకరమని, వివిధ వర్గాల మధ్య ద్వేషాలు పురికొల్పే అవకాశం ఉందని పోలీసులు భావించి, దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేని కోరారు.

వెబ్దునియా పై చదవండి