టీడీపీకి చెందిన ఇద్దరు మంగళవారం పోటీ నుంచి తప్పుకోగా, వైసీపీ నుంచి నామినేషన్ వేసిన ఇద్దరూ బుధవారం వైదొలిగారు. ఈ సందర్భంగా పెద్ద హైడ్రామానే నడిచింది. నగర పంచాయతీలోని 8వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వు కాగా టీడీపీ నుంచి కత్తి కామయ్య, ఇండ్లా కోటేశ్వరరావు.. వైసీపీ నుంచి బొజ్జా వెంకటేశ్వర్లు, బొజ్జా పరశురామ్ నామినేషన్లు దాఖలు చేశారు.
ఆ తర్వాత ఇరు పా ర్టీల నుంచి నామినేషన్లు వేసిన నలుగురు అభ్యర్థులు అదృశ్యమయ్యారు. వీరిలో టీడీపీ తరఫున నామినేష న్లు వేసిన ఇద్దరితోపాటు, తమ పార్టీ నుంచి పోటీలో ఉన్న వారిలో ఒకరైన వెంకటేశ్వర్లును వైసీపీ నాయకు లు తమ ఆధీనంలో ఉంచుకున్నారు.
దీన్ని గుర్తించిన టీడీపీ నేతలు వైసీపీ నుంచి బరిలో ఉన్న పరశు రామ్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇలా నలుగురు అభ్యర్థులను గత 10 రోజుల నుంచి దూరంగా ఉంచారు. ఉపసంహరణల తొలిరోజైన మంగళవారం వైసీపీ నాయకులు తమ చెంత ఉన్న ఇద్దరు టీడీపీ అభ్యర్థులు కత్తి కామయ్య, ఇండ్లా కోటేశ్వరరావులను తీసుకొని వచ్చి నామినేషన్లను ఉపసంహరింపచేశారు.