పిల్లలను జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్చిన ఐఏఎస్ అధికారి

బుధవారం, 6 జులై 2022 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, ఎస్.ఏ.పి., మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చేర్చి, ఇతర అధికారులకు ఆదర్శంగా నిలించారు. విజయవాడలోని పటమటలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించారు. 
 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నామని ప్రభాకర్ రెడ్డి భార్య లక్ష్మి తెలిపారు. ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె అన్నారు. పాఠశాల సౌకర్యాలు, తరగతి గదులు, ఆట స్థలం అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. 
 
గతంలో నెల్లూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. కాగా, వేసవి సెలవుల అనంతరం మంగళవారం నుంచి ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. గతేడాది విజయవాడలోని పటమట పాఠశాలలో కొత్తగా నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు చేరారు. ఈ ఏడాది కూడా దాదాపు 500 వందల మంది కొత్త విద్యార్థులు చేరుతారని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు