నిజం చెబితే దాడి చేస్తున్నారు, వెంకాయమ్మ అదే చెప్పారు: చంద్రబాబు

బుధవారం, 18 మే 2022 (19:53 IST)
గుంటూరు మహిళ వెంకాయమ్మ ఉన్నదే చెప్పారు, నిజాలు చెబితే ఆమె ఇంటిపైనా దాడి చేసారంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో పర్యటిస్తున్న ఆయన వైకాపా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పులివెందులలో ఓ బస్టాండు కట్టలేనివారు రాష్ట్రంలో 3 రాజధానులు కట్టగలరా అంటూ ప్రశ్నించారు.

 
చనిపోయిన బిడ్డను తండ్రి బైకుపై తరలిస్తుంటే దానిపై కనీసం ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరం అన్నారు. సమస్యలు చెబితే కేసులు పెడుతున్నారు, లేదంటే దాడులు చేస్తున్నారు. వైకాపా పాలనలో పేదల జీవితాలు చితికిపోతున్నాయి. బడుగుబలహీన వర్గాలను ఆదుకునేందుకు తను పోరాడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ జైత్రయాత్ర కడప నుంచే ప్రారంభమవుతుందని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు