శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన సుబ్రమణ్యం, భాగ్యలక్ష్మిలు భార్యాభర్తలు. సుబ్రమణ్యంకు అదే గ్రామానికి చెందిన ఉమాదేవితో అక్రమ సంబంధం వుందన్న ఆరోపణలున్నాయి. గత కొన్నిరోజులుగా ఉమాదేవితో సుబ్రమణ్యం కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకుండా పోయింది భాగ్యలక్ష్మి. భర్తకు ఎంత నచ్చజెప్పినా పట్టించుకోలేదు. అంతేకాదు ఉమాదేవికి ఆస్తి ఇవ్వడానికి కూడా సిద్థమయ్యాడు సుబ్రమణ్యం.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భాగ్యలక్ష్మి, తన భర్త సుబ్రమణ్యం ఊర్లో లేని సమయంలో ఉమాదేవి ఇంటికి వెళ్ళి ఆమెతో గొడవ పెట్టుకుని రోడ్డుపైకి లాక్కుని వచ్చి బట్టలు విప్పతీసింది. తన వెంట వచ్చిన మరో ముగ్గురు మహిళలు కూడా భాగ్యలక్ష్మికి సహాయం చేశారు. దీనిపై ఉమాదేవి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. తనకు న్యాయం కావాలంటూ పోలీస్టేషన్ ముందు ఉమాదేవి ఆందోళన చేపట్టింది.