జిల్లాలోని కొవ్వూరు గ్రామంలో ఇటీవల హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో అదే గ్రామానికి అద్దెపల్లి అప్పారావు(50) పాల్గొన్నారు. అయితే, రాత్రి బాగా పొద్దుపోవడంతో ఆయన ఇంటికి వెళ్లకుండా రామాలయంలోనే పడుకున్నాడు. ఆ తర్వాత అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మెలకువ వచ్చి ఇంటికి వెళ్లాడు.
ఇంటికి వెళ్లిన అప్పారావుకు భార్య కనిపించలేదు. దీంతో మిద్దెపైకి వెళ్లి చూడగా, అక్కడ చూడకూడని దృశ్యం ఒకటి చూశాడు. కొవ్వూరు గ్రామానికి చెందిన మంత్రి సత్తిబాబు(45) అనే వ్యక్తితో తన భార్య రాసలీలల్లో మునిగిపోయివుంది. దీంతో ఆగ్రహోద్రక్తుడైన అప్పారావు.. ఇటుక రాయితో సత్తిబాబు తలపై కొట్టడంతో ఆయన అక్కడతే ప్రాణాలు వదిలాడు.
హత్య సమాచారం తెలిసిన వెంటనే నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగి సీఐ కోటేశ్వరరావు, ఎస్.ఐ రామారావుతో కలిసి సోమవారం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హత్యకు గల కారణాలను గ్రామాస్థులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడు అప్పారావు పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు.