ఆంధ్రా-అమెరికా ఒప్పందం: స్మార్ట్ నగరాల అభివృద్ధికి..!

సోమవారం, 26 జనవరి 2015 (12:25 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖతో పాటు రాజస్థాన్‌లోని అజ్మీర్, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లను స్మార్ట్ నగరాలు అభివృద్ధి చేసేందుకు అమెరికాతో కేంద్ర ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా ఆదివారం రెండు దేశాల ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. 
 
ఈ ఒప్పందం ప్రకారం అమెరికా మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ది చేసేందుకు అవసరమైన నిధులను సమకూర్చటంతోపాటు అధ్యయనాలు, పర్యటనలు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మూడు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధి బృందాలు అధ్యయనం కోసం అమెరికా వెళ్తారు. 
 
స్మార్ట్ నగరాల అభివృద్ధికి అమెరికాలోని వాణిజ్య సంస్థలు, ప్రయివేట్ వ్యాపార సంస్థల సహకారం తీసుకుంటారు. స్మార్ట్ నగరాల అభివృద్ధి ఒప్పందం ద్వారా అమెరికా, భారత్ సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి