చిత్తూరులో రామ్మోహన్‌ రావు బంధువు ఇంటిపైనా ఐటీ దాడులు

బుధవారం, 21 డిశెంబరు 2016 (16:44 IST)
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు రామ్మోహన్‌ రావుకు చెందిన వియ్యంకుడు చిత్తూరులోని బద్రినారాయణ ఇంటిపై కూడా దాడులు జరిపారు. చెన్నైకి చెందిన ఐటీ అధికారులు నేరుగా చిత్తూరు నగరంలోని బద్రి నారాయణ ఇంటికి వచ్చి సోదాలు ప్రారంభించారు. తమిళనాడు సిఎస్‌ కుమారుడికి బద్రి నారాయణ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు.
 
ఈ నేపథ్యంలో బద్రి నారాయణ ఇంటిలోను రామ్మోహన్‌ డబ్బులు దాచి ఉంచాడేమోనన్న అనుమానంతో దాడులు జరుపుతున్నారు. అయితే మీడియాను లోపలికి అనుమతించడం లేదు. వివరాలను కూడా ఐటీ అధికారులు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. 10 మందికి పైగా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి