జగన్‌కు ఫ్లైట్ మిస్... రోడ్డు మార్గంలో విజయవాడకు.. నేడు గుంటూరులో దీక్ష

బుధవారం, 7 అక్టోబరు 2015 (12:00 IST)
వైకాపా అధినేత జగన్ బుధవారం గుంటూరులో దీక్ష చేపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం, హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు విమానంలో ఆయన వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన విమానాశ్రయానికి వచ్చేలోపు ఫ్లైట్ వెళ్ళిపోయింది. దీంతో రోడ్డు మార్గంలోనే ఆయన విజయవాడకు బయల్దేరారు. బెజవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్న తర్వాత, గుంటూరు వెళ్లి దీక్ష చేపడతారు. 
 
ఇదిలావుండగా, జగన్ దీక్షను విజయవంతం చేసేందుకు వైకాపా నేతలు భారీ స్థాయిలో జనసమీకరణ చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాలతో పాటు.. తెలంగాణ రాష్ట్రం నుంచి వైకాపా కార్యకర్తలను ప్రత్యేక వాహనాల్లో గుంటూరుకు తరలించారు. అలాగే, జగన్ దీక్షా వేదిక వద్ద వర్షం పడినప్పటికీ.. ఎలాంటి ఇబ్బందులు, ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు వైకాపా నేతలు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి