ఇదేం సాంప్రదాయం.. అవమానిస్తున్నారు.. అసెంబ్లీలో జగన్ ఫైర్

గురువారం, 18 డిశెంబరు 2014 (10:28 IST)
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం వాడీవేడిగా ఆరంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తరువాత మైకివ్వాలంటే జగన్ చేసిన వినతికి స్పీకర్ కోడెల తిరస్కరించారు. దీంతో రగడ మొదలయ్యింది. ప్రతిపక్షాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. 
 
తనను మైకు కోరలేదని స్పీకర్ అనడంతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ సభ్యుడు శ్రీనివాసులు స్పీకర్ కార్యదర్శితో మాట్లాడారని చెప్పారు. అయినా సరే మైకు అందలేదని అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఉద్దేశించి మాట్లాడుతూ "రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి స్పీకర్ మీరే. సంప్రదాయాలను పాటించాలి" అని అన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం సరికాదన్నారు.
 
రేపు తాము అధికారంలోకి వస్తే టీడీపీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని జగన్ హెచ్చరించారు. స్పీకర్ స్థానంలో ఉన్న న్యాయబద్ధంగా వ్యహరించాలని కోడెలకు సూచించారు.

వెబ్దునియా పై చదవండి