ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే సీఎం సతీమణి వైఎస్ భారతి, వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఏపీఐఐసీ భూములు పేదలకు ఇవ్వొద‍్దని హైకోర్టు స్టే ఇచ్చింది. ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమలు వస్తే అక్కడ పనిచేసే ప్రజలకు ఇళ్లు ఉండాలి. అందుకే అక్కడ పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. కోర్టు స్టే ఇచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారు. పులివెందుల ప్రజలకు కూడా త్వరలోనే ఇళ్ల పట్టాలు ఇస్తాం అని తెలిపారు.