పొగాకు రైతులకు జగన్ అండ: పదో తేదీ లోపు అది జరగాలి.. లేకుంటే?

శనివారం, 4 జులై 2015 (18:52 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో మాట్లాడారు. పొగాకు మద్దతు ధర రూ.150 తగ్గకుండా పెంచాలన్నారు.

గతంలో పొగాకును 120 రోజుల పాటు కొనుగోలు చేసేవారని, ఇప్పుడు దానిని 80 రోజులకు కుదించారని జగన్ ఆరోపించారు. చెరకుకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిలువునా ముంచుతున్నారని  జగన్ విమర్శించారు. అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని జగన్ మండిపడ్డారు. 
 
ఇకపోతే.. పొగాకును రైతుల నుంచి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 10 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళన నిర్వహిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల పదో తేదీకి ముందే ఏపీ సర్కారు పొగాకు రైతులకు ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తూ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలని లేకుంటే ఆందోళనలు తప్పవన్నారు.

వెబ్దునియా పై చదవండి