ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన రైతు పంజాల గంగాధర్(32) తనకున్న పొలంలో వరి సాగుచేసేందుకు నారు పోశాడు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పొలం నాటు వేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో నారు మడికి నీరుపెట్టేందుకు ఉదయం వెళ్లాడు. కరెంట్ లేకపోవడంతో మోటార్ ఆన్‌కాలేదు. దీంతో పంపులోకి కుండతో నీరు పోశాడు. ఈ క్రమంలోనే విద్యుత్ సరఫరా కావడంతో మోటార్ స్టార్టయ్యింది. పొలం నుంచి బయటకు వచ్చే క్రమంలో పైపును పట్టుకున్నాడు.
అప్పటికే మోటార్‌పంపు పైపునకువిద్యుత్ సరఫరా కావడంతో గంగాధర్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. సమీపంలోనే ఉన్న అతని భార్య రజిత, వ్యవసాయకూలీలు గమనించి పెద్దగా కేకలు వేయడంతో మరికొందరు రైతులు సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. అయితే అప్పటికే గంగాధర్ మృతిచెందాడు. భార్య రజిత, కుమారుడు సిద్దు, కూతురు అక్షయ ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.