కైలాసగిరిపై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. బాదం మిల్క్‌లో విషం కలిపి?

ఆదివారం, 12 మే 2019 (12:37 IST)
విశాఖ నగరంలో పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిపై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖపట్నం కైలాస్‌గిరిపై ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ప్రియుడు మృతిచెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. 
 
బాదం మిల్క్‌లో విషం కలిపి ఈ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ప్రేమికులు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన సత్యనారాయణ, కమలగా తెలుస్తోంది.
 
ఘటనాస్థలంలోనే సత్యనారాయణ మృతి చెందగా.. కమల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. కమల హ్యాండ్ బ్యాగ్‌లో సూసైడ్ నోట్ దొరకడంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు