ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికైన రచయిత కాళీపట్నం

మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:41 IST)
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు 2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. మే 28న ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును అందజేయనున్నారు. పురస్కారంతో పాటు రూ.లక్ష నగదు బహుమతిని కూడా ఇవ్వనున్నారు. 
 
వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన కాళీపట్నం సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. 1966లో ఆయన రాసిన 'యజ్ఞం' కథ ఎంతో పేరు తెచ్చింది. దానికిగానూ 1995లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆయన్నందరూ 'కారా' మాస్టారు అని పిలుస్తుంటారు. 
 
కారా మాస్టారుగా పేరొందిన కాళీపట్నం రామారావు 1924, నవంబరు 9న శ్రీకాకుళంలో జన్మించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటున్నారు. కథానిలయంను ప్రారంభించి అందులో రెండువేలకు పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన 2,000 పుస్తకాలను ఉంచారు.

వెబ్దునియా పై చదవండి