పవన్ కళ్యాణ్ పైన కత్తి మహేష్ దారుణ వ్యాఖ్యలు.. మజాక్‌గా అనిపిస్తోందా? అంటూ వ్యంగ్యం

బుధవారం, 6 నవంబరు 2019 (15:01 IST)
కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఘోరంగా పవన్ ఏరా అంటూ సంబోధిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. విశాఖలోని జనసేనాని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై సెటైరికల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యంగ్య వ్యాఖ్యలపై కత్తి మహేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఏపీ రాజధానిని పులివెందులలో.. హైకోర్టును కర్నూలులో పెట్టుకోవాలంటూ పవన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయిన కత్తి మహేశ్ ఘాటుగా స్పందించారు. ఇంకా ఏరా పవన్ అంటూ సంబోధనతోనే వివాదాగ్నిని రగిల్చారు.
 
ఇంకా సోషల్ మీడియాలో కత్తి మహేష్ ఒక పోస్టు పెట్టారు.'ఏరా పవన్ కళ్యాణ్... పులివెందులలో రాజధాని కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఎకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్‌గా అనిపిస్తోందా? మళ్ళీ గుండు కావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!' అంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.
 
ఇంకా విశాఖ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇప్పటివరకూ తీస్తా.. తీస్తా అని అనటమే కానీ వాడు తీసిన తాటా లేదు.. తోలూ లేదు. తొక్కా లేదు.. చిల్ చిల్.. ఆల్రెడీ వాడిగా వాడి గుండు ఒకసారి.. వేడిగా ఓటమి రెండుసార్లు తగిల్చి జనాలే తేల్చేశారు.. ఇక ఆపమనండి మాడా యవ్వారాలు.. అంటూ కత్తి వ్యాఖ్యానించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు