తెలంగాణలో కరెంట్ పాపం.. 9 ఏళ్లు పాలించిన వాళ్లదే: కేసీఆర్

గురువారం, 30 అక్టోబరు 2014 (13:24 IST)
తెలంగాణలో కరెంట్ పాపం తొమ్మిదేళ్లు పాలించిన టీడీపీ, పదేళ్లు పాలించిన కాంగ్రెస్‌ల దేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. అతి త్వరలో, విద్యుత్ విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్ ప్లస్ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని కేసీఆర్ ప్రకటించారు. 
 
ఎన్నికల ముందు తాను 107 బహిరంగ సభల్లో పాల్గొన్నానని, 87 సభల్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడేళ్లు కరెంట్ కష్టాలుంటాయని చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు. 
 
కరెంట్ అంటే షాప్‌లో దొరికే వస్తువు కాదని... కొత్త లైన్లు వేయాలంటే సంవత్సరాలు పడుతుందని కేసీఆర్ వెల్లడించారు. మూడేళ్ల తర్వాత కనురెప్ప కొట్టేంత సమయం కూడా కరెంట్ పోదని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే 14 వేల మెగావాట్ల విద్యుత్ కోసం కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి