కృష్ణా జిల్లా అర్బన్ టీడీపీలో ముసలం పుట్టింది. గెలుపు ఓటములు పక్కకు నెట్టి పంతం నెగ్గించుకునే పనిలో అర్బన్ తెలుగు తమ్ముళ్లు కొట్టుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్సెస్ విజయవాడ ఎంపీగా పర్యటనలు సాగుతున్నాయి.
సొంత పార్టీలో ముసలంపై అటు పార్టీలో ఇటు అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. విజయవాడ తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు రేగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేశినేని నానిపై బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.