కారులోకి ఆడుకోడానికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు చేరిన చిన్నారులు.. ఎలా?

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:43 IST)
కృష్ణాజిల్లాలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనంగా మారింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో దారుణం జరిగింది. మోహన్ ఫిన్ టెక్స్ అనే సంస్థ వద్ద ఈ సంఘటన జరిగింది. 
 
కారులోకి ఆడుకోవడానికి వెళ్ళిన ముగ్గురు చిన్నారులు మరణించిన తీరు అందరిని కన్నీరు పెట్టిస్తుంది. ఆడుకోవడానికి గానూ కారులోకి వెళ్ళగా కారు డోర్ లాక్ పడింది. దీనితో వారు బయటకు రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. 
 
చివరికి ఎలా బయటకు రావాలో అర్ధం కాక కారులో ఉన్న సెంట్ బాటిల్‌తో ఫ్రంట్ డోర్ పగలకొట్టే ప్రయత్నం చేసారు. అయినా సరే కారు డోర్ గాని గ్లాస్ గాని ఏది రాలేదు. వారు అరిచినా సరే మూడు గంటల పాటు వారి అరుపులు ఎవరికి వినపడలేదు.

చివరికి మూడు గంటల పాటు కారులో గాలి ఆడక ప్రాణాలు కోల్పోయారు ఆ ముగ్గురు చిన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు