కర్రలతో కొట్టి, కారం చల్లి.. పెట్రోల్ పోసి కాల్చేశారు.. ఎక్కడ?

బుధవారం, 21 ఏప్రియల్ 2021 (18:15 IST)
కృష్ణా జిల్లాలోని కంచికచెర్ల మండలం గనిఆత్కూరు రోడ్డులో అనుమానాస్పద రీతిలో మృతదేహం లభ్యమయింది. మృతుడు మూలపాడుకు చెందిన కొత్తపల్లి సాంబశివరావుగా గుర్తించారు.

మృతుడి ఒంటిపై పెట్రోల్ పోసి కాల్చిన గాయాలు వున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా అతనిని కర్రలతో కొట్టి, ఆ తర్వాత కారం చల్లిన ఆనావాళ్లు ఉన్నట్లు గుర్తించారు.
 
గురువారం సాయంత్రం నుంచి సాంబశివరావు కనిపించలేదని కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు