చంద్రబాబును చంపేందుకు మావోయిస్టుల రెక్కీ.. ఢిల్లీ నిఘా వర్గాల వెల్లడి

శనివారం, 31 డిశెంబరు 2016 (13:11 IST)
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని హత్య చేసేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఈ రెక్కీ జరిగినట్టు ఢిల్లీ నిఘా వర్గాలు వెల్లడించాయి. 
 
ముఖ్యంగా ఢిల్లీలోని ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఈ రెక్కీ నిర్వహించారని, దీనికి కారణం ఆ ప్రాంతంలో భద్రతా లోపాలు ఉన్నాయని తెలిపింది. అందువల్లే ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు తచ్చాడినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
 
ఇప్పటివరకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించారనీ, మీడియా ముసుగులో దాడి జరగవచ్చని ఢిల్లీ పోలీసు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, రెక్కీ నిర్వహణ కోసం ఎంతమంది పాల్గొన్నారనే విషయాలపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి